YSRCP: జ‌గ‌న్ కీల‌క స‌మావేశం... 2024 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా వ్యూహాల‌పై స‌మాలోచ‌న‌

ys jagan meeting with party leaders over 2024 elections
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాసేప‌ట్లో ఓ కీల‌క స‌మావేశాన్ని నిర్వ‌హించ‌నున్నారు. వైసీపీ అధినేత హోదాలో జ‌గ‌న్ నిర్వ‌హించ‌నున్న ఈ స‌మావేశానికి మంత్రులు,  ఎమ్మెల్యేలు,  ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీలో వివిధ స్థాయుల్లో ఉన్న కీల‌క నేత‌లంతా హాజ‌రు కానున్నారు. పార్టీలో కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జిల్లా అధ్య‌క్షులు, రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు ఈ భేటీలో కీల‌కంగా మార‌నున్నారు.

వైసీపీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మూడేళ్లు దాటిపోతోంది. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు రానున్నాయి. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై జ‌గ‌న్ ఈ భేటీలో కీల‌క స‌మాలోచ‌న‌లు చేయ‌నున్నారు. అనుభ‌వం ఉన్న పార్టీ నేత‌ల నుంచి స‌లహాలు, సూచ‌న‌లు తీసుకోనున్న ఆయ‌న ఎన్నిక‌ల్లో పార్టీ అనుస‌రించాల్సిన వ్యూహంపై నేత‌ల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.
Go Back to Shorts
YSRCP
YS Jagan
Andhra Pradesh
2024 Elections

More Telugu News