ముగిసిన ఢిల్లీ టూర్... విజయవాడ చేరుకున్న ఏపీ గవర్నర్
- వారం రోజుల పాటు ఢిల్లీలోనే గవర్నర్
- రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రులతో భేటీ
- మంగళవారం మధ్యాహ్నం విజయవాడకు చేరిక
రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రులతో భేటీ సందర్భంగా ఏపీలోని తాజా పరిస్థితులను గవర్నర్ వారికి వివరించారు. సోమవారంతో నేతలతో భేటీలను ముగించుకున్న గవర్నర్ రాత్రి డిల్లీలోనే బస చేసి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో బయలుదేరి విజయవాడ చేరుకున్నారు.