వాసాలమర్రి సర్పంచ్‌కు కేసీఆర్ ఫోన్...ఏం చెప్పారంటే..!
- యాదాద్రి పర్యటనలో కేసీఆర్
- వాసాలమర్రి అభివృద్ధిపై దృష్టి
- స్వయంగా గ్రామ సర్పంచ్‌కు ఫోన్
- పలు వివరాలు ఆరా తీసిన కేసీఆర్
ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబందించిన బ్లూ ప్రింట్‌ను రూపొందించాలని సర్పంచ్‌కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దళిత బంధు కింద గ్రామంలో ఎంపికైన లబ్ధిదారుల ఆదాయ, వ్యయాల వివరాలను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అర్హులైన అందరికీ దళిత బంధు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. వారంలోగా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టాలని కూడా గ్రామ సర్పంచ్‌కు కేసీఆర్ సూచించారు.