కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చ
- నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు చర్చలు
- నేడు కూడా కొనసాగనున్న చర్చలు
- సర్వే వివరాలను అందించిన పీకే
- టీఆర్ఎస్‌కే పనిచేస్తానని స్పష్టీకరణ
వచ్చే ఎన్నికల కోసం టీఆర్ఎస్‌తో ఇప్పటికే ఒప్పందం చేసుకున్న పీకే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై తన బృందంతో కలిసి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా 30 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను కేసీఆర్‌కు అందించారు. ఆ తర్వాత 89 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను కేసీఆర్‌కు తాజాగా అందించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో వరుస సమావేశాల నేపథ్యంలో ముందు టీఆర్ఎస్‌తోనే ఒప్పందం కుదిరింది కాబట్టి తాను ఆ పార్టీకే పనిచేస్తానని పీకే స్పష్టం చేసినట్టు తెలిసింది.