Roja: స్వ‌రూపానంద స్వామి ఆశీస్సులు తీసుకోవ‌డానికి విశాఖ శార‌దా పీఠానికి రోజా

roja vistst sharada pitam
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించిన వైసీపీ నాయ‌కురాలు ఆర్కే రోజా ప‌లు పుణ్య క్షేత్రాల్లో ప‌ర్య‌టిస్తూ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్న ఆమె.. ఈ రోజు విశాఖ శార‌దా పీఠాన్ని సంద‌ర్శించారు. స్వ‌రూపానంద స్వామి ఆశీస్సుల కోసం ఆమె అక్క‌డ‌కు వెళ్లారు. 

రాజ‌శ్యామల అమ్మ‌వారి ఆల‌యంలో ఆర్కే రోజా ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. రోజా వెంట ఆమె కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. పర్యాటక, సంస్కృతి, యువజన సర్వీసుల శాఖల‌ మంత్రిగా ఆర్‌కే రోజాకు ఏపీ కొత్త‌ కేబినెట్ లో చోటు ద‌క్కిన విష‌యం తెలిసిందే.
Go Back to Shorts
Roja
YSRCP
Andhra Pradesh

More Telugu News