నిశ్చితార్థం కోసం వచ్చిన వరుడి కుటుంబం.. డీజే శబ్దానికి ఆగిన యువకుడి తండ్రి గుండె!
- సోషల్ మీడియా ద్వారా యువతితో పరిచయం
- పెళ్లికి అంగీకరించిన ఇరు కుటుంబాలు
- నిశ్చితార్థానికి ఢిల్లీ నుంచి మల్కన్‌గిరి చేరుకున్న వరుడి కుటుంబం
- డీజేను ఒక్కసారిగా ఆన్ చేయడంతో గుండెపోటుతో వరుడి తండ్రి మృతి
దీంతో నిశ్చితార్థం చేసుకునేందుకు యువకుడి కుటుంబం ఢిల్లీ నుంచి బుధవారం మల్కన్‌గిరి చేరుకుంది. లాడ్జీలో బసచేసిన వారిని తీసుకెళ్లేందుకు వధువు తరపు కుటుంబం మేళతాళాలతో చేరుకుంది. ఈ క్రమంలో డీజేను ఒక్కసారిగా ఆన్ చేయడంతో ఆ శబ్దానికి వరుడి తండ్రి గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. దీంతో నిశ్చితార్థం జరగాల్సిన చోట విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఢిల్లీకి పంపే ఏర్పాట్లు చేశారు.