మేరియుపోల్ ను వశం చేసుకున్న రష్యా... సైన్యాన్ని అభినందించిన పుతిన్
- మేరియుపోల్ వశమైనట్టు ప్రకటించిన పుతిన్
- ఇది చాలా గొప్ప విషయమన్న రష్యా అధ్యక్షుడు
- మేరియుపోల్ ను కైవసం చేసుకోవడం రష్యాకు అత్యంత కీలకం
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటి నుంచి మేరియుపోల్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేస్తోంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం రష్యాకు అత్యంత కీలకం. ఎందుకంటే రష్యా ఆక్రమించిన క్రిమియాకు, రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన డాన్ బాస్ కు మధ్యలో మేరియుపోల్ ఉంది. ఇప్పుడు మేరియుపోల్ రష్యా వశం కావడంతో... క్రిమియా, డాన్ బాస్ మధ్య భూమార్గంలో రాకపోకలకు రష్యాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.