TTD: జ‌మ్మూ స‌మీపంలో వెంక‌న్న ఆల‌యం.. పనులను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి

  • మాజిన్ గ్రామంలో వెంక‌న్న ఆల‌యం
  • టీటీడీ నిధుల‌తో కొన‌సాగుతున్న ప‌నులు
  • ఏడాదిలోగా పూర్తి చేయాల‌ని సుబ్బారెడ్డి ఆదేశాలు 
ttd chairman yv subbareddy inspects work of venkateswara swamy temple in jammu

జ‌మ్మూలో శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం నిర్మాణ ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. జ‌మ్మూ స‌మీపంలోని మాజిన్ గ్రామంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నిర్మిస్తున్న ఈ ఆల‌య ప‌నుల‌ను టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మంగ‌ళ‌వారం నాడు ప‌రిశీలించారు. ఈ సందర్భంగా అక్క‌డ కొన‌సాగుతున్న ప‌నుల‌పై ఆయ‌న సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ ఆల‌య నిర్మాణ ప‌నుల‌ను ఏడాదిలోగా పూర్తి చేయాల‌ని ఆయ‌న అక్క‌డి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వైవీ సుబ్బారెడ్డి ట్విట్ట‌ర్ వేదికగా వెల్ల‌డించారు.

More Telugu News