గుంటూరు జీజీహెచ్ ను సందర్శించిన మంత్రి విడదల రజని... ఆసుపత్రి పరిస్థితులపై ఆగ్రహం!
- గుంటూరు జీజీహెచ్‌ను తనిఖీ చేసిన మంత్రి
- ఏసీలు పనిచేయకపోవడంతో అధికారులపై ఆగ్రహం
- నిర్లక్ష్యంపై సహించేది లేదని వార్నింగ్
ఈ సందర్భంగా అత్యవసర చికిత్సా విభాగంలో ఏసీలు పనిచేయని తీరును గుర్తించిన మంత్రి... ఏసీలు ఎప్పటి నుంచి పనిచేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. 6 నెలలుగా ఏసీలు పని చేయలేదని తెలుసుకున్న ఆమె... ఇంతకాలంగా ఏసీలు పనిచేయకుంటే మీరేం చేస్తున్నారంటూ ఎలక్ట్రిక్ విభాగం ఏఈని నిలదీశారు. ఇకపై విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించిన రజని... ఆయా విభాగాల్లోని సమస్యలపై అధికారులతో చర్చించారు.