నా సత్తా ఏమిటో చూపిస్తా.. భారీ ర్యాలీలో మంత్రి ఆర్కే రోజా
- మంత్రి పదవి చేపట్టాక తొలిసారి నగరిలో పర్యటన
- ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్కన్న మంత్రి
- నగరి ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారన్న రోజా
- 2024లోనూ జగనే ముఖ్యమంత్రి అని ధీమా
తనకు ఇక సీటు రాదని, రోజా పని అయిపోయిందని ప్రచారం జరిగిందని, అలా ఎగతాళి చేసిన వారి నోళ్లు మూతపడేలా ఇక్కడి ప్రజలు తనను రెండుసార్లు గెలిపించారని అన్నారు. తల్లిదండ్రులు తనకు జన్మనిస్తే, నగరి ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారని పేర్కొన్నారు.
2024లోనూ జగనే ముఖ్యమంత్రి అవుతారని రోజా ధీమా వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు నగరి ప్రజలకు సేవ చేస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు జగనన్న కోసం పనిచేస్తానని రోజా పేర్కొన్నారు.