Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. ఇన్ఫోసిస్ షేరు భారీగా పతనం!

Sensex looses 1172 points
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఐటీ, టెక్, బ్యాంకింగ్ స్టాకులు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంతో పాటు ద్రవ్యోల్బణం పెరుగుతోందన్న భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,172 పాయింట్లు నష్టపోయి 57,166 కి పడిపోయింది. నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 17,173కి దిగజారింది. ఐటీ, టెక్ సూచీలు 4 శాతానికి పైగా నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (6.11%), టాటా స్టీల్ (1.51%), మారుతి (1.37%), టైటాన్ (1.21%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.13%). 

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-7.27%), హెచ్డీఎఫ్సీ (-4.81%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-4.74%), టెక్ మహీంద్రా (-4.69%), విప్రో (-3.67%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News