పెరిగిన కరోనా కేసులు.. ఢిల్లీలో స్కూళ్ల మూసివేత!
- ఢిల్లీలో కరోనా బారిన పడుతున్న విద్యార్థులు
- ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 53 మంది
- తాజాగా మరో 14 మందికి కరోనా
ఈ సందర్భంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, పాఠశాలల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని... ఈ నేపథ్యంలో స్కూళ్లను మూసివేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు. ఇంకోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో 366 కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.95 శాతానికి పెరిగిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 18,67,572కి చేరుకుంది.