నేను కుక్కనే కానీ నీలా పిచ్చి కుక్కను కాను... సాయిరెడ్డికి బండ్ల గణేశ్ ఘాటు రిప్లై
- బండ్ల గణేశ్, సాయిరెడ్డిల మధ్య ట్వీట్ల వార్
- బండ్లను కుక్కతో పోలుస్తూ సాయిరెడ్డి ట్వీట్
- 'నీలా దోచుకోలేదు..' అంటూ గణేశ్ మండిపాటు
"ఎస్.. నేను కుక్కనే కానీ దానిలా విశ్వాసం ఉన్నవాడిని.. నీలా పిచ్చికుక్కను కాదు తెలుసుకో దొంగ సాయి.. మేము ఏం చేసుకున్నా మా సొంతానికి చేసుకున్నాం. కష్టపడ్డాం. నీలా దోచుకోలేదు. దొంగ సొమ్ము దాచుకోలేదు. ఒక్కటి గుర్తు పెట్టుకో దొంగసాయి. మీ దగ్గర అధికారం ఉంది దొంగసాయి గారూ. అరెస్ట్ చేయిస్తారో, కేసులు పెట్టిస్తారో.. కొట్టిస్తారో ఇంకెన్నెన్ని చేస్తారో. అయినా మీతో నేను పోరాడుతూనే ఉంటా దొంగ సాయి గారు. ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యానవనంలో మొలసిన గంజాయి మొక్క మీరు. ఆ గంజాయి మొక్కను పీకేసే ఒక తెలుగువాడిగా నా కర్తవ్యం. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి మీ వెనకాల లేకపోతే నీ చరిత్ర ఏంటో.. నీవు ఏంటో నీ బ్రతుకు ఏంటో ఒక్కసారి కళ్ళు మూసుకొని చూసుకో తెలుస్తుంది" అంటూ ఓ రేంజిలో బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు.