Andhra Pradesh: ఆకులు.. వక్కలు.. పక్కలు.. ఇదేగా నీ బతుకు: బండ్ల గణేశ్ కు విజయసాయి కౌంటర్

Vijay Sai Reddy Counter For Bandla Ganesh Comments
షార్ట్స్‌లో చూడండి
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డిని ఉద్దేశిస్తూ బండ్ల గణేశ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. విశాఖను దోచుకుంటూ ఆ సంపదను హైదరాబాద్ కు తరలిస్తున్నారని, విష సాయి అని బండ్ల గణేశ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే. కమ్మవారిని కులం పేరుతో తిట్టడం తగదని, చెల్లెల్ని అన్న నుంచి దూరం చేసిన దగుల్బాజీ అని విజయసాయిపై మండిపడ్డారు. 

ఆ వ్యాఖ్యలకు విజయసాయి రెడ్డి తాజాగా కౌంటర్ ఇచ్చారు. ‘ఆకులు, వక్కలు.. పక్కలు.. ఇదేగా నీ బతుకు’ అంటూ మండిపడ్డారు. ఎవరిని పడితే వాళ్లను కరవడం అంతే ఈజీ అనుకున్నావా? అంటూ ఎద్దేవా చేశారు. ఎవడో ఉస్కో అనగానే పిచ్చి పట్టిన వీధి కుక్కలా ఎగిరెగిరి మొరుగుతున్నావంటూ ఫైర్ అయ్యారు. ‘‘మొరిగి మొరిగి సొమ్మసిల్లినా ఓడలు బండ్లు అవుతాయిగానీ.. బండ్లు ఓడలు కాలేవు. అయ్యో.. గణేశా!’’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Vijayasai Reddy
Bandla Ganesh
YSRCP

More Telugu News