రెండు రోజుల్లో 300 కోట్లకి చేరువలో ' కేజీఎఫ్ 2'
- ఈ నెల 14న వచ్చిన 'కేజీఎఫ్ 2'
- తొలిరోజున 134.5 కోట్ల గ్రాస్
- ఒక్క హిందీ వెర్షన్ నుంచి 53.95 కోట్ల గ్రాస్
- రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 278.5 కోట్లు
తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 134.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తొలి రోజున హిందీ వెర్షన్ 53.95 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఒక్క కేరళలోనే ఈ సినిమా తొలి రోజున 7.30 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా తొలి రోజున 9 కోట్లకి పైగా షేర్ ను సాధించింది. రెండవ రోజున 7.3 కోట్ల షేర్ ను రాబట్టింది.
రెండు రోజుల వసూళ్లను కలుపుకుని చూస్తే, దేశవ్యాప్తంగా ఈ సినిమా 238.5 కోట్ల గ్రాస్ ను, ప్రపంచవ్యాప్తంగా 278.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు. భారీ యాక్షన్ .. దానితో ముడిపెట్టిన మదర్ సెంటిమెంట్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఈ వీకెండ్ కి ఈ సినిమా 500 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.