అమెరికా ప్రతినిధుల సభ కమిటీతో కేటీఆర్ భేటీ
- హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమెరికా కమిటీ
- కేటీఆర్‌తో కమిటీ సభ్యుల ప్రత్యేక సమావేశం
- హైదరాబాద్ ఎదుగుతున్న తీరుపై కీలక చర్చ
ఈ చర్చల్లో భాగంగా రాజకీయ అంశాలతో పాటుగా పారిశ్రామికంగా హైదరాబాద్ ఎదుగుతున్న తీరుపై ప్రధానంగా చర్చ జరిగింది. అంతేకాకుండా రక్షణ రంగంతో పాటు ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్ సాధించిన ప్రగతిని కమిటీ సభ్యులకు కేటీఆర్ వివరించారు. ఈ భేటీలో కేటీఆర్‌తో పాటు తెలంగాణ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా పాలుపంచుకున్నారు.