Lion: సింహం నోట్లో నోరు పెట్టి తాబేలు గిల్లి కజ్జాలు.. ఇదిగో వీడియో

  • చెరువులో దాహం తీర్చుకునేందుకు వెళ్లిన సింహం
  • దాని నోటి దగ్గరకు వెళ్లి విసుగు తెప్పించిన తాబేలు
  • సింహం ఎక్కడకెళితే అక్కడకెళ్లిన తాబేలు
Bold Tortoise Annoys Lion

‘సింహం పడుకుంది కదా అని జూలుకు జడ వేయకూడదు.. పక్కనే ఉంది కదా అని పులితో ఫొటో దిగకూడదు’.. ఇదీ ఓ సినిమాలోని డైలాగ్. ‘పిట్ట కొంచెం కూత ఘనం’.. ఇదీ మనం ఎప్పుడూ చెప్పుకునే నానుడి. ఈ రెండింటినీ నిజం చేసేలా ఓ బుజ్జి తాబేలు సింహాన్ని ఓ ఆటాడేసుకుంది. 

దాహమేసి కుంటలో నీళ్లు తాగడానికి వచ్చిన సింహం నోట్లో నోరు పెట్టి గిల్లి కజ్జాలు పెట్టుకుంది. విసుగు తెప్పించేసింది. సర్లే బుజ్జిది కదా.. ఎందుకులే అని ఆ సింహం మరోపక్కకెళ్లి నీళ్లు తాగుతుంటే.. ఆ బుజ్జి తాబేలు అక్కడకూ వెళ్లి సింహాన్ని కెలికేసింది. ఈసారి ఏకంగా సింహం మీసాలను కొరికేందుకు ప్రయత్నించిందండోయ్. అయినాగానీ.. అడవికి రారాజైన సింహం మాత్రం ఏమీ అనలేదు. అక్కడి నుంచి లేచి వేరే చోటకు వెళ్లబోయింది. అంతే.. అది ఎటుపోతే అటు ఆ బుజ్జి తాబేలూ వెళ్లింది. 

ఎక్కడ జరిగిందో ఏమోగానీ.. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయిపోయింది. ‘గెట్ ఆఫ్ మై పాండ్ (ఇది నా చెరువు.. వెళ్లిపో)’ అనే ట్యాగ్ తో ఫైనెస్ట్ ఆఫ్ వరల్డ్ అనే ఇన్ స్టా అకౌంట్ లో ఆ వీడియోను పోస్ట్ చేశారు. 

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

More Telugu News