పెద్ద నాయకులు కూడా అధికారం తమ చేతిలో లేదన్నట్టు వ్యవహరించారు: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
- అనేక పశ్చిమ దేశాల నేతలతో సంప్రదింపులు జరిపామన్న అధ్యక్షుడు
- చాలా మంది నుంచి సరైన స్పందన రాలేదని ఆవేదన
- ఈ 50 రోజుల పోరాటం ఉక్రెయిన్ ఘనతేనన్న జెలెన్ స్కీ
రష్యా చేస్తున్న యుద్ధం 50 రోజులు దాటిందని... ఆ దేశ దాడులను ఉక్రెయిన్ 50 రోజుల పాటు ఎదుర్కొందని జెలెన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ కోసం పోరాడుతున్న వారికి సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. ఈ 50 రోజుల పోరాటం అనేది ఉక్రెయిన్ ఘనత అని చెప్పారు. ఇది లక్షల సంఖ్యలో ఉన్న ఉక్రేనియన్ల విజయమని అన్నారు. రష్యా యుద్ధ నౌకలు పాతాళానికి పోవాల్సిందేనని చెప్పారు. ఉక్రెయిన్ మోసం చేయదు, తల వంచదని అన్నారు.