ఓ పాట మినహా 'సర్కారు వారి పాట' షూటింగ్ పూర్తి

Mahesh Babu Sarkaru Vaari Paata shooting completed except a song
  • మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా సర్కారు వారి పాట
  • పరశురామ్ దర్శకత్వంలో భారీ చిత్రం
  • త్వరలోనే బ్యాలన్స్ ఉన్న పాట చిత్రీకరణ
  • మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న మహేశ్ చిత్రం
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ నటించిన 'సర్కారు వారి పాట' చిత్రం ఓ పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే బ్యాలన్స్ ఉన్న ఆ పాటను కూడా చిత్రీకరిస్తారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. మే 12న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తమన్ సంగీతం అందించిన 'సర్కారు వారి పాట' చిత్రంలోని 'కళావతి', 'పెన్నీ' గీతాలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి.
Go Back to Shorts
Mahesh Babu
Sarkaru Vaari Paata
Shooting
Song
Tollywood

More Telugu News