ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!
- ఎంసెట్ లో ర్యాంకు కేటాయించాలంటే ఇంటర్ పాస్ అయితే చాలు
- ఎంసెట్ లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయింపు
- ఇంటర్ మార్కులకు 25 వెయిటేజిని ఎత్తేసిన ప్రభుత్వం
ఎంసెట్ లో ర్యాంకు కేటాయించడానికి ఇంటర్ లో కనీస మార్కులతో పాస్ అయితే చాలని విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పాత నిబంధనల ప్రకారం ఎంసెట్ ర్యాంకు కేటాయించాలంటే జనరల్ కేటగిరీ ఇంటర్ విద్యార్థులు 45 శాతం, ఇతరులు 40 శాతం మార్కులు తెచ్చుకోవాలి. అయితే, కరోనా నేపథ్యంలో, పాస్ అయితే చాలని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈసారి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజి ఉండదు. అంటే కేవలం ఎంసెట్ లో వచ్చిన మార్కులతోనే ర్యాంకును కేటాయిస్తారు.