ఒకేసారి విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురి మృతి
- బీహార్‌లోని ఔరంగాబాద్‌లో ఘటన
- యువకుడు పెళ్లికి నిరాకరించడంతో విషం తాగిన బాలిక
- అది చూసి మిగతా ఐదుగురు కూడా విషం తీసుకున్న వైనం
- మరో ముగ్గురు బాలికల పరిస్థితి విషమం
ఈ ఘటనలో ముగ్గురు బాలికలు అక్కికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు మగధ్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు. యువకుడిని ప్రేమిస్తున్న బాలిక తొలుత విషం తాగిందని, అది చూసి మిగతా ఐదుగురు కూడా విషం తాగారని ఔరంగాబాద్ ఎస్పీ కాంతేశ్ కుమార్ మిశ్రా తెలిపారు. బాలికలందరూ వేర్వేరు కుటుంబాలకు చెందినవారని, వయసు 12 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పారు. మిగతా ఐదుగురు అమ్మాయిలు విషం ఎందుకు తాగారన్న దానిపై విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.