దోచిన భూములన్నీ నిరూపిస్తా.. దమ్ముంటే ఆపు: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్
- ఏప్రిల్ 21న వివరాలు వెల్లడిస్తానన్న వెంకన్న
- విశాఖలోనే వివరాలు చెబుతానని వ్యాఖ్య
- సవాల్ తో కూడిన వీడియోను పోస్ట్ చేసిన వెంకన్న
విశాఖలో పెద్ద ఎత్తున భూములను కబ్జా చేస్తున్నారని తనపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించిన సాయిరెడ్డి.. ఈ వ్యవహారంపై శుక్రవారం నాడు విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. భూకబ్జాలు అంటూ తన, తన కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోందని, ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ సాయిరెడ్డి ఆ ఫిర్యాదులో పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై ఘాటుగా రియాక్ట్ అయిన బుద్ధా వెంకన్న నేరుగా సాయిరెడ్డికే సవాల్ విసురుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.