నాడు రెచ్చగొట్టి, నేడు నాటకాలు..కేంద్రంపై కేటీఆర్ ఫైర్
- యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ ట్వీట్
- రెచ్చగొట్టి మరీ వరి వేయించిందని బీజేపీపై ఆరోపణ
- ఇప్పుడు ధాన్యం కొనమంటూ నాటకాలాడుతోందని ధ్వజం
- ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటమన్న కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావించారు. యాసంగి వడ్ల కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా లేదని కేసీఆర్ ముందే రైతులకు సూచించారని కేటీఆర్ తెలిపారు. రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన కేంద్రంలోని బీజేపీ.. ఇప్పుడు యసంగి ధాన్యం కొనమంటే నాటకాలు చేస్తోందని ధ్వజమెత్తారు. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రంతో కొనిపించే దిశగా సాగుతున్న ఈ పోరాటం అన్నదాత పోరాటం మాత్రమే కాదన్న ఆయన.. ఇది తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటమని తెలిపారు.