తగ్గేదే లే అంటున్న రష్యా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులపై నిషేధం!

Russia imposes ban on Australia and New Zealand Prime Ministers
  • రష్యాపై ఆంక్షలు విధిస్తున్న పలు దేశాలు
  • అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తున్న రష్యా
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లకు చెందిన 358 మందిపై రష్యా నిషేధం
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తోంది. తాజాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. అంతేకాదు ఆ రెండు దేశాలకు చెందిన మంత్రులు, ఎంపీలు కూడా రష్యాలోకి ప్రవేశించడానికి వీల్లేదని చెప్పింది. తమపై ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 

ఆస్ట్రేలియాకు చెందిన 228 మంది, న్యూజిలాండ్ కు చెందిన 130 మందితో కూడిన జాబితాను రష్యా విడుదల చేసింది. వీరిలో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ల పేర్లు ఉన్నాయి. మరోవైపు రష్యా మరో కీలక ప్రకటన చేసింది. త్వరలోనే ఆస్ట్రేలియా మిలిటరీ, వ్యాపారవేత్తలు, రష్యాకు వ్యతిరేకంగా ఉండే జర్నలిస్టులపై కూడా నిషేధం విధిస్తామని తెలిపింది.
Go Back to Shorts
Russia
Australia
New Zealand
Prime Minister
Ban

More Telugu News