KTR: గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ స్పంద‌న ఇదే

ktr comments on governor tamilisai allegations
తెలంగాణ స‌ర్కారు త‌న‌కు ఏమాత్రం గౌర‌వం ఇవ్వ‌డం లేద‌ని, క‌నీసం రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఓ గ‌వ‌ర్న‌ర్‌కు ద‌క్కాల్సిన ప్రొటోకాల్ మ‌ర్యాద కూడా త‌న‌కు ద‌క్క‌డం లేద‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. గ‌వ‌ర్న‌ర్‌తో త‌మ‌కేమీ పంచాయితీ లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. 

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ చెబుతూ.. 'గ‌వ‌ర్నర్‌తో మాకేమీ పంచాయితీ లేదు. త‌న‌కు తానే ఊహించుకుని గ‌వ‌ర్న‌ర్ ఏదో మాట్లాడితే మేం ఏం చేయాలి? కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విష‌యంలో ఇబ్బంది పెట్టినందుకు త‌న‌ను మేం ఇబ్బంది పెడుతున్నామ‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నార‌ట‌. న‌ర‌సింహ‌న్ ఉన్న‌ప్పుడు మాకు ఎప్పుడూ ఇబ్బంది కాలేదు. గ‌వ‌ర్నర్ కాక‌ముందు త‌మిళిపై ఏ పార్టీకి చెందిన నాయ‌కురాలో అంద‌రికీ తెలుసు' అంటూ కేటీఆర్ కాస్తంత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
KTR
TRS
Telangana
Tamilisai Soundararajan

More Telugu News