Mahabubabad: మ‌హిళా ఎంపీ చేతిలోని మైక్‌ను లాగేసుకున్న ఎమ్మెల్యే

tsr mla forcely takes a mike in the hands of same party lady mp
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు సంబంధించి మ‌హ‌బూబాబాద్ జిల్లా శాఖ‌లో విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌హ‌బూబాబాద్ ఎంపీ మాలోత్ క‌విత, మ‌హ‌బూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంక‌ర్ నాయ‌క్‌ల మ‌ధ్య త‌లెత్తిన ఈ విభేదాలు గురువారం నాటి ఓ కార్య‌క్ర‌మంలో బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. ఓ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకున్న ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ మ‌ధ్య విభేదాల‌ను బ‌హిర్గతం చేసుకున్నారు. 

మ‌హ‌బూబాబాద్‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించేందుకు సిద్ధ‌ప‌డిన మాలోత్ క‌విత‌... చేతిలో మైక్ ప‌ట్టుకుని నిల‌బ‌డ‌గా... అక్క‌డికి దురుసుగా వచ్చిన శంక‌ర్ నాయ‌క్ ఆమె చేతిలోని మైక్‌ను లాగేసుకున్నారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న.. ఎంపీ వెనుక ఎత్తుగా ఉన్న వేదిక‌ను ఎక్కి ప్ర‌సంగించారు. ఈ త‌తంగం మంత్రి సత్య‌వ‌తి రాథోడ్ స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.
Go Back to Shorts
Mahabubabad
Mahabubabad MP
Mahabubabad MLA
Banoth Shankar Naik
Maloth Kavitha
Satyavathi Rathod

More Telugu News