ఉక్రెయిన్‌పై యుద్ధం ఎఫెక్ట్... పుతిన్ కుమార్తెలపై ఆంక్షలకు రంగం సిద్ధం
- పుతిన్‌కు ఇద్దరు కుమార్తెలు
- వారిపై ఆంక్షలు విధించే దిశగా ఈయూ
- ఇప్పటికే సిద్ధమైన డ్రాఫ్ట్‌పై సభ్య దేశాల చర్చలు
- పుతిన్‌ను మానసికంగా కుంగదీసేందుకే ఈ ఆంక్షలు
పుతిన్ కుమార్తెలు మారియా, క్యాథరినాలపై ఆంక్షలు విధించే దిశగా ఈయూ సాగుతోంది. ఇప్పటికే ఈ దిశగా ఓ డ్రాఫ్ట్ తయారు కాగా.. ఈయూ సభ్య దేశాలు దానిని పరిశీలిస్తున్నాయి. కూటమిలోని మెజారిటీ దేశాలు ఓకే అంటే... ఆ మరుక్షణమే పుతిన్ కుమార్తెలు ఇద్దరిపైనా ఆంక్షలు అమలు అవుతాయి.
కుమార్తెలకు సంబంధించి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్న పుతిన్.. ఈయూ ఈ దిశగా చర్యలు తీసుకుంటే మాత్రం మానసికంగా తీవ్రంగా కలత చెందే ప్రమాదం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే పుతిన్ మాదిరే ఆయన కుమార్తెలకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయా? లేవా? అన్నది మాత్రం తెలియరాలేదు.