Punjab Kings: ఐపీఎల్: చెన్నై ముందు భారీ లక్ష్యం ఉంచిన పంజాబ్ కింగ్స్

Punjab Kings set huge target to Chennai Super Kings
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో పోరులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 180 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ 32 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 60 పరుగులు చేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 24 బంతుల్లో 33, జితేశ్ శర్మ 17 బంతుల్లో 26 పరుగులు చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ  3 సిక్సులు బాదాడు. 

చెన్నై బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 2, ప్రిటోరియస్ 2 వికెట్లు తీయగా, ముఖేశ్ చౌదరి 1, బ్రావో 1, జడేజా 1 వికెట్ పడగొట్టారు.
Go Back to Shorts
Punjab Kings
Chennai Super Kings
Mumbai
IPL

More Telugu News