Nani: 'అంటే .. సుందరానికీ' ఫస్టు సింగిల్ కి ముహూర్తం ఖాయం!

  • వినోదభరిత చిత్రంగా 'అంటే సుందరానికీ'
  • నాని సరసన నాయికగా నజ్రియా 
  • ఈ నెల 6వ తేదీన ఫస్టు సింగిల్ రిలీజ్
  • జూన్ 10వ తేదీన సినిమా విడుదల  
Ante Sundaraniki movie update

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే .. సుందరానికీ' రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ  సినిమాలో నాని సరసన నాయికగా నజ్రియా నటించింది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయి. 

వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీన సాయంత్రం 6:03 నిమిషాలకు 'పంచె కట్టు' అంటూ సాగే ఫస్టు సింగిల్ ను విడుదల చేయనున్నారు. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వెళ్లాయి.

ఈ సినిమా టైటిల్ తోను .. నాని లుక్ తోను 50 శాతం మార్కులు కొట్టేసింది. ఆచార వ్యవహారాల మధ్య నలిగిపోయే యువకుడిలా నాని కనిపించనుండగా, లీలా థామస్ అనే మోడ్రన్ లేడీగా నజ్రియా ఆకట్టుకోనుంది. ఈ ఇద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలతో  ఈ కథ సరదాగా సాగుతుందని అనిపిస్తోంది.

More Telugu News