neet ug: రూ. 10 లక్షలిస్తే నీట్–యూజీ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యేలా చేస్తానంటూ ఆఫర్!

  • ఆరుగురు విద్యార్థులతో బేరం కుదుర్చుకున్న ముఠా
  • తెలియని ప్రశ్నలను ఖాళీగా వదిలేసి ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్ కు ఇస్తే వాటిని ఆ తర్వాత నింపేలా ప్లాన్
  • గుజరాత్ లోని ఓ ఎగ్జామ్ సెంటర్ లో అవినీతి రాకెట్ గుట్టురట్టు
  • ఫిజిక్స్ టీచర్ సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
10 Lakh To Solve NEET Paper Teacher Asked Aspirants To Leave It Blank

గుజరాత్ లోని ఓ నీట్ –యూజీ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాకెట్ గుట్టు రట్టయింది. రూ. 10 లక్షలు ఇస్తే నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యేలా చూస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ స్కూల్ టీచర్ తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

గత ఆదివారం ఆఫ్ లైన్ పద్ధతిలో జరిగిన ఈ పరీక్ష సందర్భంగా గుజరాత్ లోని గోధ్రాలో ఉన్న ఓ స్కూల్ ను ఏగ్జామ్ సెంటర్ చేశారు. ఆ సెంటర్ కు ఎగ్జామినేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ గా వ్యవహరించిన తుషార్ భట్ అనే ఫిజిక్స్ టీచర్ మరో ఇద్దరితో కలసి మాల్ ప్రాక్టీస్ కు పాల్పడేందుకు సిద్ధమయ్యాడు. ఆరుగురు విద్యార్థులు బేరం కుదుర్చుకున్నాడు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఓ విద్యార్థి నుంచి రూ. 7 లక్షలను అడ్వాన్స్ గా తీసుకున్నాడు.

ఈ ఎగ్జామ్ లో జవాబులు తెలియని ప్రశ్నలను మార్కింగ్ చేయకుండా ఖాళీగా వదిలేసి ఆన్సర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు ఇచ్చేస్తే తాను ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సరైన జవాబులు రాస్తానని ఆ ఆరుగురు విద్యార్థులకు చెప్పాడు. అయితే ఈ విషయం కాస్తా బయటకు పొక్కి జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఎగ్జామ్ సెంటర్ పై దాడి చేసిన పోలీసులు తుషార్ భట్ తోపాటు పరశురాం రాయ్, ఆరిఫ్ వోరా అనే ఇద్దరు బ్రోకర్లను కూడా అరెస్టు చేశారు. భట్ కారులోంచి రూ. 7 లక్షల అడ్వాన్స్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News