Medigadda Barrage: మేడిగడ్డ దెబ్బతినడానికి కారణమెవరో చెప్పండి: తెలంగాణను వివరాలు కోరిన ఉత్తరాఖండ్

  • ఉత్తరాఖండ్‌‌లో ఓ ప్రాజెక్టుకు టెండర్ వేసిన ఎల్ అండ్ టీ
  • తాము చేసిన ప్రాజెక్టుల్లో వైఫల్యం లేదని పేర్కొన్న ఎల్ అండ్ టీ
  • మేడిగడ్డను ప్రస్తావించిన ఎల్ అండ్ టీ
  • ఈ నేపథ్యంలో మేడిగడ్డ దెబ్బతినడానికి కారణాలు కావాలని తెలంగాణను కోరిన ఉత్తరాఖండ్
Uttarakhan government wants to know about medigadda barriage

మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణం ఎవరో వివరాలు కావాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం లేఖ రాసింది. తెలంగాణలోని ఈ ప్రాజెక్టు వైఫల్యానికి బాధ్యులు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీనా? లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? తెలంగాణ నీటి పారుదల శాఖ నిర్ధారించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందుకు కారణం ఉత్తరాఖండ్‌లో ఎల్ అండ్ టీ ఓ టెండర్‌ను దాఖలు చేసింది. తాము పని చేసిన ప్రాజెక్టుల్లో ఎక్కడా వైఫల్యం చెందలేదని ఎల్ అండ్ టీ పేర్కొంది. అందులో మేడిగడ్డను కూడా ప్రస్తావించింది.

అయితే మేడిగడ్డ బ్యారెజీ స్ట్రక్చర్ దెబ్బతిన్నదని, ఈ పని ఎల్ అండ్ టీ చేసిందని పత్రికల్లో చూశామని, ఈ వైఫల్యానికి ఆ సంస్థ బాధ్యత ఉందో లేదో చెప్పాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు ఉత్తరాఖండ్ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ లేఖ రాసింది. ఈ వర్క్‌కు సంబంధించి ఆ సంస్థకు తెలంగాణ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం సరైందో కాదో తెలపాలని కోరింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో స్ట్రక్చరల్ వైఫల్యం ఉందని పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో వాస్తవాలు నివేదించాలని కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌ను ఉత్తరాఖండ్ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ లేఖ ఈ నెల 8న వచ్చింది.

  • Loading...

More Telugu News