కర్నూలుకు న్యాయ రాజధాని పక్కా.. మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
- జగన్నాథ గట్టుపై హైకోర్టు భవనం
- నేషనల్ లా యూనివర్సిటీని కూడా నిర్మిస్తాం
- ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
హైకోర్టుతో పాటు ప్రతిష్ఠాత్మక నేషనల్ లా యూనివర్సిటీని కూడా జగన్నాథ గట్టుపై నిర్మించి తీరతామని బుగ్గన వ్యాఖ్యానించారు. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందని స్వయంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనకు అనుగుణంగానే బుగ్గన శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు.