కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై హ‌రీశ్ రావు ఫైర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై హ‌రీశ్ రావు ఫైర్‌

harish rao fires on piyush goyal
  • తెలంగాణ ప్ర‌జ‌ల‌ను గోయ‌ల్ అవ‌మానించారు
  • త‌క్ష‌ణ‌మే క్ష‌మాప‌ణ చెప్పాలి
  • గోయ‌ల్ ఓ వ్యాపారిలా మాట్లాడుతున్నారన్న హ‌రీశ్ 
యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కించ‌ప‌రిచేలా గోయ‌ల్ వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోపించిన హ‌రీశ్.. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు శుక్ర‌వారం నాడు మీడియాతో మాట్లాడిన హ‌రీశ్ రావు తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివక్ష గోయ‌ల్ వ్యాఖ్య‌ల‌తో మ‌రోమారు బ‌ట్ట‌బ‌య‌లైంద‌ని ఆరోపించారు.

తెలంగాణ రైతుల‌ను అవ‌మానిస్తే ఊరుకునేది లేదని చెప్పిన హ‌రీశ్.. తెలంగాణ ప్ర‌జ‌లు నూక‌లు తినాలంటూ గోయ‌ల్ వ్యాఖ్యానించ‌డం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను అవ‌మానించిన‌ట్టేన‌ని తేల్చిచెప్పారు. గోయ‌ల్ ఓ కేంద్ర మంత్రిలా కాకుండా ఓ వ్యాపారిలా మాట్లాడుతున్నార‌ని కూడా హ‌రీశ్ ధ్వ‌జ‌మెత్తారు. నూక‌లైనా తింటాం గానీ కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించుతామ‌ని హ‌రీశ్ ప్ర‌తిన‌బూనారు.
Telangana
Harish Rao
Piyush Goyal

More Telugu News