శ్రీలంకలో దుర్భర పరిస్థితులు.. ఆహారం లేక అలమటిస్తున్న ప్రజలు!
- ఆర్థిక, ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక
- పెట్రోల్ బంకుల వద్ద క్యూలలో నిలబడి స్పృహ కోల్పోతున్న లంకేయులు
- కాగితం కొరతతో వాయిదా పడిన పరీక్షలు
మరోవైపు, డీజిల్ కొనుగోలు కోసం బంకుల వద్ద ఎవరూ బారులు తీరొద్దని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ పేర్కొంది. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద మండుటెండలో క్యూ లైన్లలో నిల్చుంటున్నవారిలో పలువురు స్పృహ కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
శ్రీలంకలో ప్రస్తుతం రోజుకు 10 గంటల సేపు కరెంట్ కోత విధిస్తున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రోడ్లపై అంధకారం నెలకొంటోంది. కొన్ని రెస్టారెంట్లు కొవ్వొత్తుల వెలుగుల్లోనే వ్యాపారాన్ని నడిపిస్తున్నాయి. ఔషధాల కొరత కూడా శ్రీలంకను వేధిస్తోంది. అత్యవసరం కాని ఆపరేషన్లను ఆసుపత్రులు వాయిదా వేస్తున్నాయి. కాగితం కొరత కూడా లంకను చాలా ఇబ్బంది పెడుతోంది. ఈ నెలలో విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.