Telangana: తెలంగాణ‌లో 40 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు నిల్‌

corona updates in telangana
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 19,052 కరోనా పరీక్షలు నిర్వహించగా, 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 35 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,253 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,86,680 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 462 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

Telangana
Corona Virus

More Telugu News