Hero Moto Corp: బ్లాక్ మ‌నీతో "హీరో" ఎండీ ఫాం హౌజ్ కొనుగోలు.. ఐటీ దాడుల‌తో వెలుగులోకి

hero moto corp md buy a farm house with black money
  • ఇటీవ‌లే హీరో మోటో కార్ప్‌పై ఐటీ దాడులు
  • రూ.100 కోట్ల‌తో ఫాం హౌజ్ కొన్న ప‌వ‌న్ ముంజాల్‌
  • ఆ డ‌బ్బంతా బ్లాక్ మ‌నీయేనని ‌గుర్తింపు 
  • రూ.1,000 కోట్లు వ్య‌యం చేసిన‌ట్టు త‌ప్పుడు నివేదిక‌లు
ఆటోమోబైల్ రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరో మోటో కార్ప్ యాజ‌మాన్యం అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డిపోయింది. బ్లాక్ మ‌నీతో ఆ కంపెనీ య‌జ‌మాని పవ‌న్ ముంజాల్ ఏకంగా ఓ ఫాం హౌజ్‌నే కొనుగోలు చేశార‌ట‌. అంతేకాకుండా ప‌లు కార్య‌క్ర‌మాల కోసం రూ.1,000 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్టు త‌ప్పుడు నివేదిక‌ల‌ను కూడా ఆయ‌న సృష్టించార‌ట‌.

ఈ నిజాల‌న్నీ ఇటీవ‌ల ఆ కంపెనీపై జ‌రిగిన ఆదాయప‌న్ను శాఖ దాడుల్లో తేలాయి‌. ఐటీ దాడుల సంద‌ర్భంగా అటు హీరో గానీ, ఇటు ఐటీ అధికారులు పెద్ద‌గా వివ‌రాలు వెల్ల‌డించ‌కున్నా.. తాజాగా ఐటీ శాఖ హీరో యాజ‌మాన్యం చీక‌టి కోణాల‌ను బ‌య‌ట‌పెట్టింది. బ్లాక్ మ‌నీతో ఫాం హౌజ్‌ను కొన్న ప‌వ‌న్ ముంజాల్ అందుకు ఏకంగా రూ.100 కోట్ల‌ను వెచ్చించార‌ట‌.
Hero Moto Corp
Pavan Munjal
IT Raids

More Telugu News