పద్మావతి నిలయంలో కలెక్టరేట్.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్
- పద్మావతి నిలయంలో కలెక్టరేట్ వద్దంటూ పిటిషన్
- ఇప్పటికే హైకోర్టులో ఈ వివాదంపై రెండు సార్లు విచారణ
- సింగిల్ జడ్జి తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్
- డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్
పద్మావతి నిలయంలో కలెక్టరేట్ ఏర్పాటు వద్దంటూ ఇప్పటికే దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేయగా.. పద్మావతి నిలయంలోనే కలెక్టరేట్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ తీర్పు వచ్చింది. తాజాగా ఈ తీర్పును సవాల్ చేస్తూ భాను ప్రకాశ్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఏప్రిల్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.