Nitish Kumar: సొంత ఊర్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై దాడి... వీడియో ఇదిగో!

Youth attacks on Bihar CM Nitish Kumar in his own village
షార్ట్స్‌లో చూడండి
బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై అనూహ్య రీతిలో దాడి జరిగింది. అది కూడా ఆయన స్వగ్రామంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన సొంతూరు భకిత్యాపూర్ విచ్చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడిగా ఖ్యాతి గాంచిన షిల్ భద్ర యాజీ విగ్రహాన్ని స్థానిక ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణకు విచ్చేసిన నితీశ్ కుమార్ నివాళులు అర్పిస్తుండగా, ఓ యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చి ఆయనపై దాడి చేశాడు. 

ఈ ఘటనతో అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే భద్రతా సిబ్బంది ముందుకొచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆ యువకుడు మతిస్థిమితం లేనివాడని భావిస్తున్నారు. ఏదేమైనా, ఎంతో భద్రత ఉండే సీఎంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Nitish Kumar
Bihar
Chief Minister
Attack

More Telugu News