ICC Womens World Cup 2022: దంచికొట్టిన స్మృతి, షెఫాలీ, మిథాలీ.. దక్షిణాఫ్రికా ఎదుట కొండంత లక్ష్యం

Late strikes keep India to 274 runs for 7
షార్ట్స్‌లో చూడండి
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు దుమ్మురేపారు. మహిళల ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయారు. తొలుత స్మృతి మంధాన, షెఫాలీ వర్మ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగా, ఆ తర్వాత కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ సఫారీ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి సఫారీలకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

మంధాన 84 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 71 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 46 బంతుల్లో 8 ఫోర్లతో 53, మిథాలీ రాజ్ 84 బంతుల్లో 8 ఫోర్లతో 68, హర్మన్‌ప్రీత్ కౌర్ 57 బంతుల్లో 4 ఫోర్లతో 48 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మసబాట క్లాస్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, అయబొంగ ఖాక, చోలే ట్రయాన్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఇండియా మూడింటిలో గెలిచి ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 8 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఏడు పాయింట్లతో వెస్టిండీస్ ఉంది. రన్ రేట్ కూడా మైనస్‌లలో ఉండడంతో భారత్‌ నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంంది.
Go Back to Shorts
ICC Womens World Cup 2022
Team India
South Africa
Mithali Raj

More Telugu News