Salman Khan: సల్మాన్ హీరోగా 'పవన్ పుత్ర భాయిజాన్'

Bajarangi Bhaijan Movie Sequel
షార్ట్స్‌లో చూడండి
2015లో వచ్చిన భారీ బాలీవుడ్ సినిమాలలో 'బజరంగీ భాయిజాన్' ఒకటిగా కనిపిస్తుంది. సల్మాన్ -  కరీనా కపూర్ జంటగా నటించిన ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించగా, కబీర్ ఖాన్ దర్శకత్వం వహించాడు. రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ఉండనుందనీ .. సీక్వెల్ కి కథను సిద్ధం చేసే పనిలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారనే టాక్ వినిపించింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయేంద్రప్రసాద్ కి, 'బజరంగీ భాయిజాన్' సీక్వెల్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. 

అందుకు ఆయన స్పందిస్తూ .. "నిజమే ఆ సినిమాకి సీక్వెల్ ఉంది. అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 'పవన్ పుత్ర భాయిజాన్' టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతుంది" అని చెప్పుకొచ్చారు. మొత్తానికి 'బాహుబలి'కి సీక్వెల్ వచ్చినట్టుగానే, 'బజరంగీ భాయిజాన్' కి సీక్వెల్ రానుందన్న మాట.
Go Back to Shorts
Salman Khan
K V Vijayendra Prasad
Pavan Putra Bhaijan Movie

More Telugu News