అవును .. 'వలిమై' 200 కోట్లకి పైగా వసూలు చేసింది!: బోనీకపూర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవును .. 'వలిమై' 200 కోట్లకి పైగా వసూలు చేసింది!: బోనీకపూర్

valimai movie update
  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'వలిమై'
  • అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి 
  • ప్రతినాయకుడిగా కార్తికేయ 
  • రేపటి నుంచి జీ 5లో స్ట్రీమింగ్
అజిత్ హీరోగా ఇటీవల 'వలిమై' సినిమా వచ్చింది. సిహెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మించారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, తొలి మూడు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఒక్క తమిళనాట తప్ప మితగా భాషలలో ఈ సినిమా అంతగా ప్రభావం చూపలేకపోయింది. 

అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి నటించగా, ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించాడు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ 5వారు దక్కించుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా 200 కోట్లకి పైగా వసూలు చేసిందనే టాక్ నడుస్తోంది. అయితే చాలామంది అందులో ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు. 

ఈ సినిమా తొలి మూడు రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టినప్పటికీ, ఆ తరువాత వసూళ్లు డ్రాప్ అవుతూ వచ్చాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమ సినిమా 200 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిందని బోనీ కపూర్ ట్వీట్ చేసి, పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. వినోద్ .. బోనీ కపూర్ కాంబినేషన్లోనే అజిత్ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు.
Ajith
Huma Qureshi
Karthikeya
Valimai Movie

More Telugu News