ప్రభాస్ మూవీ టైటిల్ గా 'కల్కి'?
- ఇటీవలే విడుదలైన 'రాధే శ్యామ్'
- లైన్లో 'సలార్' .. 'ఆది పురుష్'
- నాగ్ అశ్విన్ చిత్రానికి 'కల్కి' టైటిల్
- కీలక పాత్రలో అమితాబ్
అయితే ఈ సినిమాకి 'ప్రాజెక్టు K' అనేది వర్కింగ్ టైటిల్ గానే అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ప్రాజెక్టు K'లో.. K అంటే ఎవరు? ఏమిటి? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. K అంటే 'కల్కి' అనీ .. అదే ఈ సినిమా టైటిల్ అని అంటున్నారు. 'కల్కి' పేరుతోనే ప్రభాస్ కనిపిస్తాడని చెబుతున్నారు.
ఇంతవరకూ ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్నాడనే చెప్పుకున్నారు. అయితే ఈ సినిమాలో పురాణాలు .. ఇతిహాసాలకి సంబంధించిన ప్రస్తావన కూడా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. దీపికా పదుకొణే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు.