Allu Arjun: త‌న టీమ్ స‌భ్యుడికి స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

allu arjun video goes viral
షార్ట్స్‌లో చూడండి
సినీ న‌టుడు అల్లు అర్జున్ త‌న తాజా చిత్రం 'పుష్ప' ఇచ్చిన కిక్‌తో ఖుషీగా ఉన్నాడు. ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ త‌న అభిమానులనూ ఖుషీ చేస్తున్నాడు. తాజాగా, తన కంటెంట్‌, డిజిటల్‌ హెడ్‌ శరత్‌ చంద్ర నాయుడు పుట్టిన రోజు వేడుక జ‌రుపుకోగా, ఒక్క‌సారిగా అక్క‌డ‌కు కేక్‌ తీసుకొచ్చి అల్లు అర్జున్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు. 

                      
                                   
గ‌తంలోనూ బ‌న్నీ ఇలాగే త‌న కోసం ప‌నిచేసే వారి పెళ్లి, పుట్టిన‌రోజు వేడుక‌ల‌కు హాజ‌రై స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఒక్క‌సారిగా అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో త‌మ కార్య‌క్ర‌మాలకు హాజ‌ర‌వుతుండ‌డంతో ఆయ‌న వ‌ద్ద ప‌నిచేసే వారిలో మ‌రింత ఉత్సాహం నిండుతోంది. కాగా, 'పుష్ప' పార్ట్ 1 హిట్ త‌ర్వాత పార్ట్ 2లో న‌టించేందుకు బన్నీ సిద్ధ‌మ‌వుతున్నాడు. 

Go Back to Shorts
Allu Arjun
Tollywood
Viral Videos

More Telugu News