పాలనలో భాగస్వామం కండి.. నిరుద్యోగులకు కవిత పిలుపు
- తెలంగాణ ప్రజలకు కవిత హోలీ గ్రీటింగ్స్
- ఆర్గానిక్ కలర్స్ వాడాలని సూచన
- నిరుద్యోగులకు ఉత్సాహం నింపుతూ సరికొత్త పిలుపు
శ్రద్ధ పెట్టి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పరిపాలనలో భాగస్వామ్యం అవ్వండి అంటూ ఆమె ఇచ్చిన పిలుపు నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం నింపనుందన్న భావన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో విడుదల చేసిన కవిత.. అందులోనే నిరుద్యోగులకు ఈ పిలుపు ఇచ్చారు. హోలీ సంతోషంగా నిర్వహించుకోవాలని, ఆర్గానిక్ రంగులనే వినియోగించాలని ఆమె రాష్ట్ర ప్రజలను కోరారు.