శ్రీలంక ముందు భారీ లక్ష్యం... అప్పుడే ఓ వికెట్ తీసిన టీమిండియా
- శ్రీలంక టార్గెట్ 447 రన్స్
- ముగిసిన రెండో రోజు ఆట
- 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసిన శ్రీలంక
- బుమ్రా ఖాతాలో వికెట్
అంతకుముందు తన రెండో ఇన్నింగ్స్ ను టీమిండియా 303-9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ 67, పంత్ 50, జడేజా 22, రోహిత్ శర్మ 46, విహారి 35, మయాంక్ అగర్వాల్ 22 పరుగులు చేశారు.
కాగా, లంక జట్టులో సీనియర్ పేసర్ సురంగ లక్మల్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా లక్మల్ ను టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపారు.