ఆ ఒక్క విషయంలో ప్రభాస్ పై అభిమానులు అసంతృప్తితో ఉన్నారు: కృష్ణంరాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ఒక్క విషయంలో ప్రభాస్ పై అభిమానులు అసంతృప్తితో ఉన్నారు: కృష్ణంరాజు

Krishnamraju opines on Prabhas career
  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ 'రాధేశ్యామ్'
  • రాధేశ్యామ్ లో పరమహంస పాత్ర పోషించిన కృష్ణంరాజు
  • ప్రభాస్ కెరీర్ పై కృష్ణంరాజు వ్యాఖ్యలు
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ఈ నెల 11న రిలీజై భారీ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పెదనాన్న, సీనియర్ నటుడు కృష్ణంరాజు కూడా నటించడం తెలిసిందే. రాధేశ్యామ్ రిలీజ్ అనంతరం కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ చిత్రంలో తన పాత్ర పేరు పరమహంస అని, ఆ పాత్రలో తనను చూస్తుంటే దేవుడ్ని చూసినట్టుగా ఉందని ప్రభాస్ అన్నాడని వెల్లడించారు. 

ప్రభాస్ కెరీర్ గురించి మాట్లాడుతూ, ఒక్క విషయంలో మాత్రం అభిమానులు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ప్రభాస్ రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తుండడం వాళ్లకు నచ్చడంలేదని అన్నారు. రాధేశ్యామ్ త్వరగా పూర్తయ్యేదే కానీ, కరోనా ప్రభావం వల్ల ఆలస్యమైందని వివరించారు. ఇకపై సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నాడని అభిమానులకు కృష్ణంరాజు తియ్యని కబురు చెప్పారు. ప్రభాస్ కెరీర్ అంచనాలకు మించి సాగుతోందని, అందులో తనకెలాంటి సందేహంలేదని స్పష్టం చేశారు.
Krishnamraju
Prabhas
Fans
Radhe Shyam
Tollywood

More Telugu News