మహిళల ప్రపంచకప్.. విండీస్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్
- పాక్‌పై గెలిచి న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్
- విండీస్‌ను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి
- దూకుడుగా ఆడుతున్న యస్తికా భాటియా
బ్యాటింగ్ విభాగంలో ప్రధానంగా సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పిన కెప్టెన్ మిథాలీ రాజ్ వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతామని న్యూజిలాండ్‌తో ఓటమి తర్వాత పేర్కొంది. ఈ మ్యాచ్‌లో భారత్, విండీస్ మహిళల జట్టు రెండూ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. ప్రస్తుతం ఐదు ఓవర్లు ముగిశాయి. భారత జట్టు వికెట్ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. స్మృతి మంధాన నెమ్మదిగా ఆడుతుండగా, యస్తిక భాటియా దూకుడుగా ఆడుతోంది. 6 ఫోర్లతో 29 పరుగులతో క్రీజులో ఉంది.