య‌శోద ఆసుప‌త్రికి చేరుకున్న‌ కేటీఆర్, హ‌రీశ్ రావు

ktr reached yashoda hospital
  • కేసీఆర్‌కు స్వ‌ల్ప అస్వ‌స్థ‌త 
  • ఆసుప‌త్రి వ‌ద్దే కేసీఆర్ భార్య, కూతురు
  • అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్న వైద్యులు
తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని సోమాజిగూడ‌ యశోద ఆసుప‌త్రికి వెళ్లి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటోన్న విష‌యం తెలిసిందే. కేసీఆర్ స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆయ‌న‌ను చూసేందుకు ఆసుప‌త్రికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు కూడా వెంట‌నే వెళ్లారు. మ‌రోవైపు, ఆసుప‌త్రి వ‌ద్దే ఎంపీ సంతోష్ కుమార్‌, కేసీఆర్ భార్య శోభ, కూతురు క‌విత‌, మ‌న‌వ‌డు హిమాన్ష్ కూడా ఉన్నారు. కేసీఆర్‌కు సాధార‌ణ వైద్య ప‌రీక్ష‌ల్లో భాగంగా అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నార‌ని మీడియాకు తెలిపారు.
Go Back to Shorts
KTR
Telangana
KCR

More Telugu News