మాది మతపిచ్చి పార్టీ అనేవాళ్లు గోవాలో బీజేపీ హ్యాట్రిక్ ను చూడాలి: కిషన్ రెడ్డి
- గోవాలో అతిపెద్ద పార్టీగా బీజేపీ
- మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం
- మైనారిటీలు ఎక్కువగా ఉన్న చోట హ్యాట్రిక్ అన్న మంత్రి
ఉత్తరప్రదేశ్ లోనూ బీజేపీ అద్భుతమైన రీతిలో ఫలితాలు సాధించిందని, యూపీలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వరుసగా రెండుసార్లు ఓ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అరుదైన విషయమని, అలాంటిది యూపీలోనూ, ఉత్తరాఖండ్ లోనూ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఉత్తరాఖండ్ లో కొన్ని కారణాల రీత్యా ముఖ్యమంత్రులు మారినప్పటికీ ప్రజలు తమపై విశ్వాసం ఉంచారని కిషన్ రెడ్డి వివరించారు. మణిపూర్ లోనూ తమదే హవా అని స్పష్టం చేశారు.