Andhra Pradesh: ఏపీలో 69 మందికి కరోనా పాజిటివ్... తాజా బులెటిన్ ఇదిగో!

AP corona daily statistics report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 12,180 కరోనా పరీక్షలు నిర్వహించగా, 69 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో 14, అనంతపురం జిల్లాలో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. కడప, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 139 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18,547 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,03,001 మంది ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1000 లోపుకి దిగొచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 817 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఇప్పటిదాకా 14,729 మంది మరణించారు.
.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Dailty Statistics
Today Cases

More Telugu News